విజయవాడలో దారుణం
close

తాజా వార్తలు

Updated : 29/04/2021 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడలో దారుణం

భార్య, కన్నబిడ్డలను కడతేర్చాడు..

విజయవాడ: విజయవాడ వాంబే కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు బిడ్డలను కిరాతకంగా పొట్టన పెట్టుకున్న ఓ భర్త.. అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. వాంబే కాలనీలోని డీ బ్లాక్‌లో మోహన్‌, నీలవేణి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. భారీగా అప్పులు చేయడంతో పాటు తరచూ భార్యతో  మోహన్‌ గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే భార్యతో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేసి పరారయ్యాడు. ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురినీ గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటినుంచి పారిపోయిన మోహన్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. రైలు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాణ భయంతో తప్పుకొనే యత్నంలో తీవ్ర గాయాలపాలపాలయ్యాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని చికిత్స కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని