close

తాజా వార్తలు

Updated : 03/08/2020 20:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధిక బిల్లులేసిన ఆస్పత్రికి అనుమతి రద్దు

హైదరాబాద్‌: కరోనా పేరుతో రోగులకు అధిక బిల్లులు వేస్తున్న ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా సోమాజిగూడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి కరోనా చికిత్స అందించే అనుమతిని రద్దు చేసింది. కరోనా రోగుల నుంచి అధిక బిల్లులు వేసి డబ్బులు లాగుతోందని ఈ ఆస్పత్రిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఆస్పత్రికి కరోనా చికిత్స అనుమతి రద్దు చేయడంతోపాటు ఇకపై కొత్త కరోనా కేసులను చేర్చుకోవద్దని ఆదేశించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కార్యాలయం ఆ ఆస్పత్రికి నోటీసులు జారీ చేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.