close

తాజా వార్తలు

Updated : 28/02/2021 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

పెద్దపల్లి: రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో శనివారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు అధికారులు ట్రయల్‌రన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంస్థ సీఈవో నిర్లప్‌ సింగ్‌ రాయ్‌ హాజరయ్యారు. రూ.6,180 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాయి. దీంతో రెండు దశాబ్దాల క్రితం మూత పడిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు మళ్లీ పునర్‌వైభవం రానుంది. ఈ  పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేపనూనె పూత పూసిన యూరియాను ఉత్పత్తి చేయనున్నారు. రామగుండం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు యూరియా సరఫరా కానుంది. కాగా వాణిజ్య ఉత్పత్తి మార్చిలో ప్రారంభిస్తామని సీఈవో నిర్లప్‌ సింగ్ రాయ్‌ ప్రకటించారు. ప్లాంట్‌ పూర్తిస్థాయి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ట్రయల్‌రన్‌ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 

 ఏటా 13 లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి చేయలనేది ఈ పరిశ్రమ లక్ష్యం. దేశంలో ఏటా 300 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను వినియోగిస్తుండగా 240 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 60 లక్షల మెట్రిక్‌ టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో మొదటిగా తెలంగాణలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సిద్ధమైంది. ఇప్పటికే ఈ కర్మాగారాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో రాజస్థాన్‌, ఒడిశాలకు చెందిన వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో పనులు చివరి దశలో నిలిచిపోయాయి. పనిచేయడానికి కార్మికులు మళ్లీ రావడంతో కర్మాగార నిర్మాణపనులను దాదాపు పూర్తిచేశారు. 

 

 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని