ఉరేసుకొని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 30/03/2021 03:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉరేసుకొని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలోని శ్రీకాకుళం క్యాంపస్‌కు చెందిన ఓ విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. వసతిగృహంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ గాంధీనగర్‌లోని గొల్లపేటకు చెందిన  ఎం‌.మాధురి(20) నూజివీడు ట్రిపుల్‌ ఐటీలోని సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. వసతిగృహంలోని తోటి విద్యార్థినులు భోజనానికి వెళ్లిన సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 

విషయం తెలుసుకున్న ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ వెంకటరమణ, ఎస్సై గణేశ్‌ బాబు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని మృతికి ప్రేమ వ్యవహారమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని