
తాజా వార్తలు
ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణం
అగర్తలా: త్రిపురలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించిన రోడ్డును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్దేవ్ కుమార్ ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా 680 మీటర్ల రోడ్డును నిర్మించినట్లు బిప్లవ్దేవ్ తెలిపారు. రాజధాని అగర్తలాలోని బీకే రోడ్డులో ఉన్న మహిళా కళాశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ రోడ్డు రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్ రోడ్డుగా ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించిన ఈ రోడ్డు నిర్మాణానికి రూ.70 లక్షల ఖర్చయినట్లు పశ్చిమ త్రిపుర జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో మరిన్ని రహదారులను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి
Tags :