తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె
close

తాజా వార్తలు

Updated : 21/02/2021 19:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరాస మరో అభ్యర్థిని ప్రకటించింది. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. వాణీదేవి రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఖరారు చేసిన తెరాస.. తాజాగా హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌కు వాణీదేవిని ఎంపిక చేసింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి చిన్నారెడ్డి, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానానికి రాములు నాయక్‌ను ఖరారు చేసింది. ఇప్పటికే వారిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎల్లుండితో నామినేషన్ల గడువు ముగియనుంది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మార్చి 17న  ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని