కొండగట్టు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం:తెరాస
close

తాజా వార్తలు

Published : 09/03/2021 13:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొండగట్టు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం:తెరాస

కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం మంత్రితో పాటు ఎమ్మెల్సీ కవిత కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రూ.90 లక్షలతో రామకోటి స్థూపాన్ని నిర్మిస్తున్నామన్నారు. జూన్‌ 4వ తేదీ లోపు నిర్మాణం పూర్తి చేయడానికి ఇవాళ భూమిపూజ చేసినట్టు చెప్పారు. 23 అడుగుల ఎత్తున స్థూపం నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. యాదాద్రి ఆలయాన్ని రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దేనని మంత్రి అన్నారు. 

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..‘‘ కొండగట్టు అంజన్న  తెలంగాణ ప్రజల కొంగు బంగారం. కొండగట్టు ఆంజనేయ సేవాసమితి ఏర్పాటు చేస్తాం. ఇంటింట్లో హనుమాన్‌ చాలీసా జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ నెల 17 నుంచి అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం ఉంటుంది’’ అని ఆమె అన్నారు. భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజయ్‌, సుంకే రవిశంకర్‌ పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని