భాజపా విజ్ఞప్తి.. ఉపఎన్నికకు తెరాస దూరం
close

తాజా వార్తలు

Published : 17/04/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా విజ్ఞప్తి.. ఉపఎన్నికకు తెరాస దూరం

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం పోటీకి దూరంగా ఉండాలని తెరాస నిర్ణయించింది. భాజపా విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ నుంచి ఎన్నికైన భాజపా కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించారు. ఆ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉపఎన్నిక జరగనుంది. రమేష్ గౌడ్ కుమారుడు భాజపా తరఫున పోటీ చేస్తున్నందున ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని తెరాసను భాజపా కోరింది.

మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ప్రగతిభవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సమావేశమైంది. సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం చేయకుండానే ఆకుల రమేష్ గౌడ్ మరణించడం ఎంతో బాధాకరమని కేటీఆర్ అన్నారు. భాజపా విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఒప్పుకున్నారని.. సీఎం సూచన మేరకు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు కేటీఆర్‌ తెలిపారు. మానవతా ధృక్పథంతో ఆలోచించి భాజపా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు కేసీఆర్‌, కేటీఆర్‌లకు ప్రతినిధుల బృందం కృతజ్ఞతలు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని