జనరంజకంగా కేసీఆర్‌ పాలన: తలసాని
close

తాజా వార్తలు

Published : 29/04/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనరంజకంగా కేసీఆర్‌ పాలన: తలసాని

హైదరాబాద్‌: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన జనరంజకంగా సాగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద మాజీ కార్పొరేటర్లతో కలిసి తెరాస పార్టీ జెండాను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు కేసీఆర్‌, తెరాస శ్రేణులు చేసిన పోరాటం ఎంతో గొప్పదని కొనియాడారు. స్వరాష్ట్రంలో సాగుతున్న కేసీఆర్‌ పాలన పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే విధంగా ఉందన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్న విద్యుత్తు, నీటి సరఫరా విషయంలో విజయం సాధించామన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ తెరాస ప్రభుత్వం పేద ప్రజల పక్షాన.. అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుతం రెండో దశ కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.

దేశంలోనే నంబర్‌ వన్‌గా తెలంగాణ: మల్లారెడ్డి

తెలంగాణకు కేసీఆర్‌ వంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసం వద్ద తెరాస పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. 2001 ఉద్యమ కాలం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకునే వరకు కేసీఆర్‌ చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. బంగారు తెలంగాణ దిశగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజల గుండెల్లో కేసీఆర్‌ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని