‘పసుపు బోర్డు ఏమైందో అర్వింద్‌ చెప్పాలి’
close

తాజా వార్తలు

Published : 16/03/2021 11:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పసుపు బోర్డు ఏమైందో అర్వింద్‌ చెప్పాలి’

తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్‌ 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పసుపు బోర్డు ఏమైందో నిజామాబాద్‌ భాజపా ఎంపీ అర్వింద్‌ చెప్పాలని తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన గన్‌పార్క్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోమని కేంద్రం పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిందన్నారు. ఎన్నికల సమయంలో బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన ఎంపీ అర్వింద్‌.. ఇప్పుడు ఆ పని చేసి ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి దగ్గరికి వెళ్లి పసుపు బోర్డుపై మాట్లాడాలన్నారు.  

భాజపా అంటే అబద్ధాల పార్టీ అని.. అమ్మకం పార్టీగా మారిందని జీవన్‌రెడ్డి విమర్శించారు. ప్రతిరోజూ ఏదో ఒక సంస్థను భాజపా అమ్ముతోందని ఆక్షేపించారు. తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు, రైల్వే కోచ్‌ ఇవ్వమని కేంద్రం చెప్పిందని దానిపై పోరాడాలన్నారు. తెరాస పార్టీ చేసిన అభివృద్ధిని చెప్పడానికి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌కు గంటకు పైగా సమయం పట్టిందన్నారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు నమ్మరని జీవన్‌రెడ్డి అన్నారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని