
తాజా వార్తలు
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత
హైదరాబాద్: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 1999, 2004లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2013లో టీఆర్ఎస్లో చేరారు. 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. నోముల నర్సింహయ్య మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
1956 జనవరి 9న నల్గొండ జిల్లా పాలెంలో జన్మించిన నోముల నర్సింహయ్య విప్లవోద్యమంలో విద్యార్థిగా.. వామపక్ష నాయకుడిగా.. ఆధునిక రాజకీయాల్లో అలుపెరగని నేతగా గుర్తింపు పొందారు. మూడున్నర దశాబ్దాల పాటు కమ్యూనిస్టు నేతగా సేవలందించిన ఆయన తెరాసలో చేరడం విమర్శలకు దారితీసినా.. అక్కడా విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించారు.
1978 నుంచి 2018 దాకా నాలుగు దశాబ్దాలపాటు నాగార్జునసాగర్ నియోజకవర్గ రాజకీయ యవనికపై ఏకఛత్రాధిపత్యం వహించిన కుందూరు జానారెడ్డిని ఓడించిన చరిత్ర నోములది. 2014లో జానారెడ్డి చేతిలో ఓటమి పాలై విమర్శలు మూటగట్టుకున్నా.. వెరవని ధీరత్వంతో మరుసటి ఎన్నికల్లోనే ప్రత్యర్థిని కంగుతినిపించారు. 1994 మినహా ఏడు సార్లు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న జానారెడ్డిని ఓడించడం నోముల ప్రత్యేకతను చాటింది. నోముల తన రాజకీయ ప్రస్థానంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఓటమి పాలయ్యారు. 2009లో భువనగిరి పార్లమెంట్ స్థానంలో, 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.
సీఎం కేసీఆర్ సంతాపం
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నేతగా నోముల నిలిచిపోతారన్నారు. నర్సింహయ్య మరణం తెరాస, నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటన్నారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. నోముల రాజకీయ జీవితం ప్రజా పోరాటాలతోనే కొనసాగిందని, ఆయన మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మంత్రి కేటీఆర్ అన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
