సాగర్‌ ఉపఎన్నికలో తెరాస విజయం
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 17:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాగర్‌ ఉపఎన్నికలో తెరాస విజయం

హైదరాబాద్: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించింది. తెరాస అభ్యర్థి నోముల భగత్‌ 18,872 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కౌంటింగ్‌ పూర్తయ్యే సరికి తెరాసకు తెరాసకు 89,804  ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 70,932 ఓట్లు, భాజపాకు 7,676 ఓట్లు, తెదేపా 1,714 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులకు 2,915 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో జానారెడ్డి రెండో స్థానంలో ఉండగా.. భాజపా డిపాజిట్‌ కోల్పోయింది.

నా తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాను: నోముల భగత్‌

‘‘నాకు ఓటేసి ఆశీర్వదించిన నాగార్జునసాగర్‌ ఓటరు మహాశయులందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక పాదాభివందనాలు. నా విజయానికి కష్టపడ్డ ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులకు ధన్యవాదాలు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా ధన్యవాదాలు. నా తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాను. నియోజకవర్గం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయసహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను’’ అని భగత్‌ తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని