సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు
close

తాజా వార్తలు

Updated : 15/07/2020 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఇచ్చిన స్టే ను రేపటి వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సచివాలయం కూల్చివేతకు ముందస్తు పర్యావరణ అనుమతి తీసుకోలేదని విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ స్పందిస్తూ... కూల్చివేత సమయంలో పర్యావరణ అనుమతి అవసరం లేదని, జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకున్నామని తెలిపారు. నిర్మాణానికి భూమిని సిద్ధం చేసేందుకు పర్యావరణ అనుమతి అవసరమని, కూల్చివేతలు.. నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడానికేనని హైకోర్టు అభిప్రాయపడింది. నిర్మాణ సమయంలో పర్యావరణ అనుమతులు తీసుకుంటామని ఏజీ తెలిపారు. పర్యావరణ అనుమతిపై రేపు కేంద్రం వివరణ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూర్చే తీర్పులుంటే సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సచివాలయం కూల్చివేతకు సంబంధించి మంత్రివర్గ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు సమర్పించింది. విచారణ రేపటికి వాయిదా పడింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని