వలస కూలీల ఫోన్‌‌...స్పందించిన కేటీఆర్‌
close

తాజా వార్తలు

Published : 16/05/2020 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వలస కూలీల ఫోన్‌‌...స్పందించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుసాయం, పోలీసుల నుంచి అనుమతి లేక వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూలీలు ఫోన్‌ చేసి సమస్యను వివరించడంతో  తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. వారిని స్వస్థలాలకు పంపించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన కూలీలు ముస్తాబాద్‌కు పనికోసం వచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో కాలినడకన స్వస్థలానికి పయనమయ్యారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం పెద్దూరు చేరారు. వారికి స్థానిక నాయకులు ఆశ్రయం ఇచ్చి రెండ్రోజులుగా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. వారు స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు లభించకపోవడంతో పెద్దూరులోనే ఉండిపోయారు. వలస కూలీలు శుక్రవారం రాత్రి మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌ చేసి తమ ఇబ్బందులను వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి ... కూలీలను వెంటనే వారి స్వస్థలాలకు పంపించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ప్రత్యేక వాహనంలో కూలీలను ఒడిశా తరలించారు. తమ సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని