‘కూల్చివేత పనుల పరిశీలనకు అనుమతివ్వండి’
close

తాజా వార్తలు

Published : 07/08/2020 17:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కూల్చివేత పనుల పరిశీలనకు అనుమతివ్వండి’

హైకోర్టులో కాంగ్రెస్‌ పిటిషన్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత పనుల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌, కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యవసర వ్యాజ్యంగా పరిగణించి ఇవాళ విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సచివాలయంలో గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోందని తెలిపారు. దీనికి స్పందించిన కోర్టు.. నిరాధార, ఊహాజనిత అంశాలను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. అత్యవసర విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం నిరాకరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని