తీవ్రత పెరిగితే రక్షించడం కష్టం: ఈటల
close

తాజా వార్తలు

Updated : 11/09/2020 12:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తీవ్రత పెరిగితే రక్షించడం కష్టం: ఈటల

హైదరాబాద్‌: ప్రజారోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు అదఃపాతాళంలో ఉన్నట్టు కొవిడ్‌తో తేలిందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మండలిలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైరస్‌ కట్టడికి వైద్య, ఆరోగ్యసిబ్బంది చేస్తున్న కృషి అనిర్వచనీయమన్న మంత్రి .. ఆరోగ్య కార్యకర్తల కృషికి మనం ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందన్నారు.

రాబోయే రోజుల్లో ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత పెంచనున్నట్టు తెలిపారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చే విషయంపై చర్చిస్తున్నామని, సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఈటల స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స పొందాలని సూచించారు. కరోనా తీవ్రత పెరిగితే బాధితులను రక్షించడం కష్టమవుతుందన్నారు. ప్రజలు తీసుకున్న జాగ్రత్తల వల్ల ..ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాల శాతం కూడా తగ్గిందని ఈటల రాజేందర్‌ వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని