Covaxin: తెలంగాణకు ఎక్కువ డోసులివ్వండి
close

తాజా వార్తలు

Updated : 27/04/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covaxin: తెలంగాణకు ఎక్కువ డోసులివ్వండి

భారత్‌ బయోటెక్‌ సీఎండీని కోరిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

హైదరాబాద్‌: కొవిడ్ టీకాల పంపిణీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని.. వీలైనన్ని ఎక్కువ డోసులు అందించాలని భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల కలిశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీకాల విషయమై భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్‌ చర్చించారు. కరోనా (Corona) వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని.. అందుకోసం రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ డోసులను సరఫరా చేయాలని కృష్ణ ఎల్లను కోరారు. విజ్ఞప్తి మేరకు రాష్ట్రానికి ఎక్కువ డోసులిచ్చేందుకు భారత్ బయోటెక్ సానుకూలంగా స్పందించిందని సీఎస్‌ తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని