TS: ఎల్లుండి నుంచి పాఠశాలలకు సెలవులు
close

తాజా వార్తలు

Updated : 25/04/2021 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: ఎల్లుండి నుంచి పాఠశాలలకు సెలవులు

ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలోని పాఠశాలు, జూనియర్‌ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్‌ 27నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేసవి సెలవుల నిర్ణయంపై సీఎస్‌, విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్‌ చేసినట్లు గుర్తు చేశారు. 1 నుంచి 9 తరగతులకు చెందిన 53.79లక్షల మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేశామన్నారు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు తెరిచే విషయంపై జూన్‌ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఏప్రిల్‌ 26ను ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి పనిదినంగా పరిగణిస్తామని సబిత చెప్పారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని