
తాజా వార్తలు
నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం
ప్రకటించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
దేవరకొండ: నల్గొండ జిల్లా రోడ్డుప్రమాదం మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో బాధిత కుటుంబాలను మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మృతుల పిల్లల చదువులతో పాటు ఆర్థికంగానూ భరోసా కల్పించనున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల పరిహారం, రెండు పడక గదుల ఇళ్లతో పాటు వారి పిల్లలకు గురుకులాల్లో చదివిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గాయపడిన వారికి అన్ని రకాల సహాయక చర్యలు చేపడతామన్నారు.
అంతకుముందు బాధిత కుటుంబాల ఆందోళనతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. తమను ఆదుకోవాలంటూ మృతుల కుటుంబాలు ఆస్పత్రి ముందు ఆందోళన నిర్వహించాయి. బాధితులకు ఆందోళనకు భాజపా శ్రేణులు మద్దతు తెలిపి మృతదేహాలను తరలించే వాహనానికి అడ్డుపడ్డాయి. ఈ క్రమంలో ఆయా కుటుంబాలను ఆదుకుంటామంటూ మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు.
ఇవీ చదవండి..
ఆర్టీసీ బస్సులో ‘అనంత’ కలెక్టర్