‘చారిత్రక కట్టడాల అభివృద్ధికి కమిటీలు వేయండి’
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చారిత్రక కట్టడాల అభివృద్ధికి కమిటీలు వేయండి’

తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌: చారిత్రక కట్టడాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గోల్కొండ, కుతుబ్‌షాహీ టుంబ్స్‌ దెబ్బతిన్నాయన్న పత్రికా కథనాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. చారిత్రక కట్టడాల అభివృద్ధిపై ప్రత్యేక కమిటీలు వేయాలని, ఈనెల 22లోగా కమిటీ మొదటి సమావేశం జరగాలని ఉన్నత  న్యాయస్థానం ఆదేశించింది. చారిత్రక కట్టడాల అభివృద్ధికి కచ్చితమైన బ్లూ ప్రింట్‌ రూపొందించాలని సూచించింది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 12న నివేదికలు సమర్పించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ ఉందనగా చివరి నిమిషంలో నివేదికలు ఇవ్వడం బాధ్యతా రాహిత్యమని పేర్కొంది. రాష్ట్రంలో 27 చారిత్రక కట్టడాలు ఉన్నాయని పురావస్తుశాఖ హైకోర్టుకు తెలిపింది. గోల్కొండ పరిసరాల్లో 151 అక్రమ నిర్మాణాలు వెలిశాయని అసిస్టెంట్‌ సోలిసిటర్‌ జనరల్‌ తెలిపారు. తదుపరి విచారణ జూన్‌ 10కి వాయిదా పడింది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని