TS NEWS: సామాజిక వైద్యుల వినతిని పరిగణనలోకి తీసుకోండి: హైకోర్టు

తాజా వార్తలు

Published : 24/07/2021 16:22 IST

TS NEWS: సామాజిక వైద్యుల వినతిని పరిగణనలోకి తీసుకోండి: హైకోర్టు

హైదరాబాద్‌: సామాజిక వైద్యుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.  2015లో జారీ అయిన జీవో  ప్రకారం... తమకు శిక్షణ ఇవ్వాలని కోరుతూ ఆర్‌ఎంపీ, పీఎంపీలు గత నెల 5న వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. కానీ, వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించడం లేదని ఆర్‌ఎంపీ, పీఎంపీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పారామెడిక్స్‌ శిక్షణ ఇవ్వాలన్న సామాజిక వైద్యుల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. చట్టానికి అనుగుణంగా వీలైనంత తర్వరగా వినతిపత్రాన్ని పరిగణించాలని సూచిస్తూ హైకోర్టు విచారణ ముగించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని