కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట
close

తాజా వార్తలు

Published : 10/06/2020 14:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఫామ్‌హౌస్‌పై వివరణ ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన నోటీసులపై కేటీఆర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎన్టీటీ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ స్టే మంజూరు చేసింది. 

జన్వాడ ఫామ్‌ హౌస్‌పై మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌లోని అంశాల ఆధారంగా వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. దీంతో కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని