తితిదేకి బోర్డు సభ్యుడు భారీ విరాళం
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 11:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తితిదేకి బోర్డు సభ్యుడు భారీ విరాళం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు కుమారగురు తితిదేకి భారీ విరాళం అందజేశారు. తమిళనాడు రాష్ట్రం ఉల్లందూర్‌పేట్‌లో ఉన్న 4 ఎకరాల స్థలం, రూ.3 కోట్ల 16 లక్షల నగదును అందించారు. ఈ భారీ విరాళానికి సంబంధించిన డీడీలు, భూ పత్రాలను తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డికి కుమారగురు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ మాట్లాడుతూ రూ.20 కోట్లు విలువ చేసే 4 ఎకరాల స్థలాన్ని ఇచ్చిన తితిదే బోర్డు సభ్యుడిని అభినందించారు. త్వరలోనే ఉల్లందూర్‌పేట్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతామని వివరించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తితిదే చర్యలు చేపట్టిందని సుబ్బారెడ్డి తెలిపారు.

 

ఇదీ చదవండి..
పుస్తకరూపంలో నాదనీరాజనం కార్యక్రమాలు

పెళ్లి పత్రికలపైకి రైతు ఉద్యమం



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని