close

తాజా వార్తలు

ఆ బాలుడు 12 ఏళ్లకే పదో తరగతి..!

ఇంఫాల్‌: మణిపూర్‌లో ఓ బాలుడు పన్నెండేళ్లకే పదోతరగతి పరీక్షలకు అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అతడి వయసు పన్నెండే అయినా.. సైకాలజీ పరీక్షలో 17ఏళ్ల మానసిక వృద్ధిని కనబరచడంతో అతడికి ఈ అవకాశం దక్కింది. మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌ జిల్లా కంగ్వి గ్రామానికి చెందిన ఐజాక్‌ పౌల్లుంగ్‌మాన్‌(12) అనే బాలుడు స్థానిక మౌంట్‌ ఓలివ్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేశారు. చదువులో ఐజాక్‌ చురుకుదనాన్ని గమనించిన అతడి తండ్రి ఆ బాలుడిని పదోతరగతి బోర్డు పరీక్షలకు అనుమతించాలని విద్యాశాఖకు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును స్వీకరించిన విద్యాశాఖ అధికారి ఆ బాలుడికి సైకాలజీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం సైకాలజీ పరీక్షలకు హాజరైన బాలుడు అందులో ఉన్నతంగా ప్రతిభ కనబర్చాడు. కేవలం 12 ఏళ్లకే 17 సంవత్సరాల 5నెలల మానసిక వృద్ధిని కనబర్చాడు. అతడి తెలివితేటల సామర్థ్యం (ఇంటలిజెంట్‌ కోషంట్‌) 141గా నిర్దారించారు. దీంతో అధికారులు ఆ బాలుడికి పదోతరగతి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆ బాలుడి తండ్రి మాట్లాడుతూ.. ‘నా కుమారుడి ఆశయాన్ని నెరవేర్చే దిశగా సానుకూలంగా స్పందించి అవకాశం కల్పించినందుకు అధికారులకు ధన్యవాదాలు’ తెలిపారు. ఐజాక్‌ మాట్లాడుతూ.. ‘ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఐజాక్‌ న్యూటన్‌ అంటే ఇష్టం. ఆయనే నాకు స్ఫూర్తి.. ఎందుకంటే నాది కూడా అదే పేరు కాబట్టి’ అని తెలిపాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.