Corona: ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాలు
close

తాజా వార్తలు

Updated : 27/04/2021 22:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాలు

బీడ్‌: మహారాష్ట్రలో అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థ వైఫల్యాన్ని కళ్లకు కట్టే ఘటన చోటుచేసుకుంది. కరోనాతో మరణించిన 22 మంది మృతదేహాలను ఒకే అంబులెన్స్‌లో తరలించడం విమర్శలకు దారి తీసింది. సరైన వైద్య పరమైన రవాణా సదుపాయాలు లేనందునే ఇలా చేయాల్సి వచ్చిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో కొవిడ్‌తో చనిపోయిన 22 మంది మృతదేహాలను ఒకే అంబులెన్సులో తరలించారు. బీడ్‌ జిల్లాలోని స్వామీ రామానంద్‌తీర్థ్‌ గ్రామీణ ప్రభుత్వ వైద్య కళాశాల మార్చురీలో ఉంచిన మృతదేహాలను దహన సంస్కారాల కోసం ఆదివారం ఇలా రవాణా చేశారు. ఆస్పత్రిలో అంబులెన్సులు తగినన్ని లేనందున కరోనా రోగులను తరలించే వాహనంలోనే 22 మృతదేహాలను ఒకేసారి శ్మశానాలకు తరలించారు.

ఈ ఘటనపై వైద్య కళాశాల డీన్ డా. శివాజీ సుక్రే స్పందించారు. ఆస్పత్రిలో తగినన్ని అంబులెన్సులు లేనందునే ఇలా జరిగిందన్నారు. గత ఏడాది తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలో తమ వద్ద ఐదు అంబులెన్సులు ఉండేవని.. అందులో మూడింటిని ఆస్పత్రి నుంచి ఉపసంహరించడంతో కొవిడ్‌ బాధితులను తరలిస్తున్నట్లు వివరించారు. మరో మూడు అంబులెన్సులను మంజూరు చేయాలని జిల్లా అధికారులకు మార్చి 17న లేఖ రాసినట్లు చెప్పారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని