పైకప్పు కూలి ఇద్దరు సింగరేణి కార్మికులు మృతి
close

తాజా వార్తలు

Updated : 08/04/2021 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పైకప్పు కూలి ఇద్దరు సింగరేణి కార్మికులు మృతి

భూపాలపల్లి: తెలంగాణలోని భూపాలపల్లి పరిధి కేటీకే ఆరో గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. పైకప్పు కూలడంతో ఇద్దరు సింగరేణి కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మూడో సిమ్ 11వ లెవల్లో కార్మికులు శంకరయ్య, నరసయ్య సపోర్ట్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో పైకప్పు ఒక్కసారిగా కూలడంతో వారిద్దరూ మృతిచెందినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మంత్రి ఎర్రబెల్లి సంతాపం

సింగరేణి ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయా కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని