సర్పవరం వద్ద పరిశ్రమలో పేలిన బాయిలర్‌
close

తాజా వార్తలు

Updated : 11/03/2021 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్పవరం వద్ద పరిశ్రమలో పేలిన బాయిలర్‌

ఇద్దరి మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

సర్పవరం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సర్పవరం వద్ద రసాయన పరిశ్రమలో బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తాళ్లరేవు మండలం పటవలకు చెందిన కాకర్ల సుబ్రహ్మణ్యం (31), గొళ్లప్రోలు మండలానికి చెందిన తోటకూర వెంకటరమణ (37)గా గుర్తించారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయ. 

గాయపడిన ముగ్గురు శ్రీనివాసరావు (50), నమ్మి సింహాద్రిరావు (30), సత్య సాయిబాబా (55), రేగిల్లి రాజ్‌కుమార్‌ (35)లను మాధవపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాయిలర్‌ పేలుడుతో పరిశ్రమలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కన్నబాబు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌, ఎస్పీ అద్నామ్‌ నయీమ్‌ అస్మీ, డీఎంహెచ్‌వో గౌరీశ్వర్‌, ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ తదితరులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని