కస్టడీకి అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు
close

తాజా వార్తలు

Published : 19/01/2021 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కస్టడీకి అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు

హైదరాబాద్‌: ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల పోలీసు కస్టడీకి సికింద్రాబాద్‌ కోర్టు అనుమతి ఇచ్చింది. అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు మల్లికార్జున్ రెడ్డి, సంపత్‌లను మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులను రేపు చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

ఈ కేసులో అఖిలప్రియ సహా ఇప్పటివరకు 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అఖిలప్రియ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు బెయిల్‌ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశముందని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో న్యాయస్థానం ఆమెకు బెయిల్‌ నిరాకరించింది.

ఇవీ చదవండి..

TS: ప్రభుత్వం ముందు 14 డిమాండ్లు

కార్పొరేట్‌ కంపెనీలకు తాకట్టు: రేవంత్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని