రైలుపట్టాల వద్ద ఇద్దరు అనుమానాస్పద మృతి
close

తాజా వార్తలు

Published : 19/04/2021 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైలుపట్టాల వద్ద ఇద్దరు అనుమానాస్పద మృతి

బోనకల్లు: రైలు పట్టాల వద్ద ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బోనకల్లు సమీపంలోని రైలు పట్టాల వద్ద పడి ఉన్న రెండు మృతదేహాలను ఈ ఉదయం గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతులను కృష్ణా జిల్లా వత్తవాయి మండలం వేములనర్వ గ్రామానికి చెందిన శివ(18), తిరుపతిరావు(32)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వీరివురు ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి చనిపోయారా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని