close

తాజా వార్తలు

Published : 13/01/2021 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరుడుగట్టిన ఘరానా దొంగలు అరెస్ట్

హైదరాబాద్‌: నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన ఘరానా దొంగలను వేర్వేరు కేసుల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.21లక్షల విలువ చేసే బంగారం, వజ్రాలు, రూ.13వేల నగదు, ద్విచక్ర వాహనం, ఆటో స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ మీడియాకు వివరించారు. టోలీచౌకి ప్రాంతానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ జాఫర్‌.. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. వరంగల్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఇతను చోరీలకు పాల్పడినట్లు వివరించారు. మరో కేసులో కిషన్‌బాగ్‌కు చెందిన హబీబ్‌ అజ్మత్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇతను కూడా వరుస చోరీలు చేసినట్టు అంజనీకుమార్‌ తెలిపారు. అజ్మత్‌తో కలిసి చోరీలకు పాల్పడిన షేక్‌ ఫరూఖ్‌ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నట్లు అంజనీకుమార్‌ తెలిపారు.

పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలి..
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వగ్రామాలకు వెళ్లే వారు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అంజనీ కుమార్‌ సూచించారు. రాత్రి వేళల్లో నగరంలో పెట్రోలింగ్‌, నిఘా అధికం చేసినట్టు చెప్పారు. స్వగ్రామాలకు వెళ్లే వారు ఆ సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌లో ప్రచారం చేయొద్దని.. వాటిని నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఊరు వెళ్లాలనుకునే వారు ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు, స్థానిక పోలీసు స్టేషన్లలో ముందస్తు సమాచారం ఇవ్వాలని అంజనీ కుమార్‌ సూచించారు.

ఇవీ చదవండి..
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

రుణ యాప్‌ల కేసులో మరో ఇద్దరి అరెస్టుTags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని