పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
close

తాజా వార్తలు

Published : 12/03/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

వల్లూరు: కడప జిల్లా పుష్పగిరి ఆలయం సమీపంలోని పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముద్దనూరు మండలం థర్మల్‌ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు.. వల్లూరు పరిధిలోని పుష్పగిరి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. పుష్పగిరి కొండపై వెలసిన సంతాన మల్లేశ్వర స్వామి, చెన్నకేశవులను దర్శించుకున్నారు. 

అనంతరం కొండ దిగువన పెన్నానదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. స్నానం చేస్తున్న క్రమంలో నది లోపలికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు అక్కడ ఊబిలో చిక్కుకుని గల్లంతయ్యారు. గల్లంతైన వారిని కార్తీక్‌, నందకిశోర్‌గా గుర్తించారు. స్థానికంగా ఉన్న ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని