ఈ బుడతడు.. ఇట్టే సమాధానాలు చెబుతాడు
close

తాజా వార్తలు

Published : 22/11/2020 16:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ బుడతడు.. ఇట్టే సమాధానాలు చెబుతాడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏబీసీడీలు రాసేంత వయసు రాలేదు. వివిధ దేశాల జాతీయ పతాకాల పేర్లు మాత్రం చెప్పేస్తున్నాడు. ఫార్ములా అంటే తెలియదు కానీ రసాయన సమీకరణాలు చెప్పి అందరినీ అబ్బురపరుస్తాడు. చూస్తే రెండేళ్ల బుడతడే అయినా ఆ చిట్టి మెదడు ఎన్నో అద్భుతాలు చేస్తోంది. అందుకే అతిపిన్న వయసులోనే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
విజయవాడకు చెందిన చిన్నారి అక్షిత్‌ వయసు రెండేళ్లు. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. తన జ్ఞాపకశక్తి మాత్రం అద్భుతం. ఒక్కసారి చెప్పడమే ఆలస్యం.. దేన్నయినా ఇట్టే గుర్తు పెట్టుకుంటాడు. వివిధ దేశాల జాతీయ పతాకాలను గుర్తుపడతాడు. దేశ రాజధానుల పేర్లను అనర్గళంగా చెప్పేస్తాడు. ఏదైనా ఒక్కసారి చూశాడా, విన్నాడా అంతే. ఎప్పుడైనా, ఎక్కడైనా దాని గురించి చెప్పేస్తాడు. ప్రముఖుల చిత్రాలను చూసి వారి పేర్లూ చెప్పేస్తాడు. క్లిష్టమైన రసాయన సమీకరణాలు సైతం చెప్పి అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. 20 నెలల వయసులోనే అక్షిత్‌ జనరల్‌ నాలెడ్జ్‌లో ప్రతిభ కనబర్చి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. విజయవాడ అయ్యప్పనగర్‌లో నివాసముంటున్న మురళీకృష్ణ, శిరీష దంపతుల కుమారుడు అక్షిత్‌. తండ్రి బ్యాంకు మేనేజర్‌, తల్లి గృహిణి. ఏడాదిన్నర వయసులోనే అక్షిత్‌లోని ఈ ప్రత్యేక నైపుణ్యాన్ని తల్లి శిరీష గుర్తించారు. చిన్నారి ప్రతిభకు శిక్షణ ఇచ్చి ఆమె మరింత మెరుగు పెట్టారు. తన కుమారుడు శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నట్లు శిరీష తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని