close

తాజా వార్తలు

Published : 16/04/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లగేజీ బ్యాగులో గుర్తు తెలియని మృతదేహం

కుప్పం గ్రామీణం: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో గుర్తు తెలియని మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. నడుమూరు సమీపంలోని కుప్పం- కృష్ణగిరి జాతీయ రహదారి పక్కన స్థానికులు ఈ ఉదయం అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఓ బ్యాగును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాగును తెరిచి చూడగా మృతదేహం సగ భాగం లభ్యమైంది. నడుము భాగం నుంచి దిగువ కాళ్ల వరకు మాత్రమే బ్యాగులో కుక్కి పడేశారు. కాగా, మిగతా సగభాగం కోసం పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని