ఛత్తీస్‌గఢ్‌ అమరులకు అమిత్ షా నివాళి
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఛత్తీస్‌గఢ్‌ అమరులకు అమిత్ షా నివాళి

జగదల్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌-సుకుమా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో నక్సల్స్‌ దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఈ ఉదయం జగదల్‌పూర్‌ చేరుకున్న ఆయన.. అమరవీరుల మృతదేహాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ బఘెల్‌ కూడా నివాళులర్పించారు.

మరికాసేపట్లో రాష్ట్ర ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం కూడా పాల్గొననున్నారు. అనంతరం కాల్పుల్లో గాయపడిన జవాన్లను షా పరామర్శిస్తారు. ఆ తర్వాత ఘటన జరిగిన ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌ను సందర్శించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

బీజాపూర్‌-సుకుమా అటవీ ప్రాంతంలో గత శనివారం మావోయిస్టులు - పోలీసుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో 22మంది భద్రతాసిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. దట్టమైన అటవీప్రాంతంలో టేకులగూడ గ్రామానికి ముందు వ్యూహాత్మకంగా ఎత్తయిన ప్రదేశాల నుంచి చుట్టుముట్టి కాల్పులకు తెగబడడం మావోయిస్టులకు అనుకూలంగా మారగా.. కోబ్రా దళం అసాధారణ శౌర్యంతో వారిని ఎదుర్కొంది. ఎన్‌కౌంటర్ సమాచారం అందిన వెంటనే అమిత్ షా తన అసోం పర్యటనను మధ్యలోనే ముగించుకుని దిల్లీ వెళ్లారు. అక్కడ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. భద్రత బలగాలపై మావోయిస్టుల దాడికి తగిన సమయంలో తగిన రీతిలో బదులిచ్చి, ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉద్ఘాటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని