తరగతి గదిలో గొడవ.. విద్యార్థి హత్య!
close

తాజా వార్తలు

Published : 01/01/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తరగతి గదిలో గొడవ.. విద్యార్థి హత్య!

లఖ్‌నవూ: తరగతి గదిలో మొదలైన సాధారణ గొడవ ఓ విద్యార్థి హత్యకు దారితీసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో  గురువారం జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  14 సంవత్సరాల వయసున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య గదిలో కూర్చునే విషయంలో తగవు ఏర్పడింది.  దీంతో ఓ విద్యార్థి కోపంతో ఆర్మీ అధికారి అయిన తన అంకుల్‌  రివాల్వర్‌(గన్‌) తీసుకొని గురువారం పాఠశాలకు వచ్చాడు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల సమయంలో క్లాస్‌ జరుగుతుండగా నిందితుడు ఒక్కసారిగా గొవడపడిన ఆ  విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధిత విద్యార్థి తల, ఛాతీ, పొట్ట భాగంలో బుల్లెట్లు దిగాయి. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 

  వెంటనే నిందితుడు రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరుపుతూ బయటకు పరుగెత్తడం ప్రారంభించాడు. అప్రమత్తమైన పాఠశాల అధ్యాపకులు విద్యార్థి నుంచి గన్‌ లాగేసుకొని అతన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.  నిందితున్ని అదుపులోకి తీసుకొని అతని బ్యాగ్‌లో ఉన్న మరో పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి సంతోష్‌కుమార్‌సింగ్‌ చెప్పారు.  

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని