యూపీ సీఎం.. మాజీ సీఎంకు కరోనా
close

తాజా వార్తలు

Published : 14/04/2021 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీ సీఎం.. మాజీ సీఎంకు కరోనా

లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కరోనా బారిన పడ్డారు. తనకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు యోగి వెల్లడించారు. ఇప్పటికే ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి కరోనా సోకడంతో మంగళవారం ఆదిత్యనాథ్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రోజు వారి కార్యక్రమాలను వర్చువల్‌గా ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. తనను ఇటీవల కలిసిన వారందరూ కొవిడ్‌ పరీక్షలు చేసుకోవాలని సీఎం కోరారు. 

అఖిలేశ్‌ యాదవ్‌కూ..
మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు కూడా కరోనా సోకింది. ఇటీవల హరిద్వార్‌ కుంభమేళాలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని