బడ్జెట్‌: ఎమ్మెల్యేలకు రూ.50వేలతో ట్యాబ్‌లు 
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 18:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌: ఎమ్మెల్యేలకు రూ.50వేలతో ట్యాబ్‌లు 

లఖ్‌నవూ: కరోనా మహమ్మారి దృష్ట్యా ఈసారి పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను కాగిత రహితంగా ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మేడిన్‌ ఇండియా ట్యాబ్ చూసుకుంటూ బడ్జెట్‌ పద్దు చదివారు. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కేంద్రం బాట పట్టింది. రానున్న రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలను కాగితరహితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇందుకోసం యోగి సర్కార్‌ భారీగానే ఖర్చు చేస్తోంది. 

కాగిత రహిత బడ్జెట్‌ సమావేశాల కోసం శాసనసభ, మండలి సభ్యులంతా ట్యాబ్‌లను కొనుగోలు చేయాలని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం సభ్యులకు రూ. 50వేల చొప్పున రియింబర్స్‌ చేయనుంది. ‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఐపాడ్‌లు తీసుకోవాలని చెప్పాం. ఒక్కో ట్యాబ్‌ ఖరీదు దాదాపు రూ. 50వేలు ఉంటుంది. ఆ మొత్తాన్ని రియింబర్స్‌ చేస్తాం’ అని యూపీ ఉపముఖ్యమంత్రి, ఐటీశాఖ మంత్రి దినేశ్ శర్మ వెల్లడించారు. అంతేగాక, సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే వీరందరికీ పేపర్‌లెస్‌ సెషన్లపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

రాష్ట్ర మంత్రులంతా ఇ-కేబినెట్‌ సమావేశాలు నిర్వహించాలని, దీని వల్ల కాగితరహిత బడ్జెట్‌ సమావేశాలు ఏర్పాటు చేయడం సులువవుతుందని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. ఫిబ్రవరి 18న యూపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా సభ్యులంతా ట్యాబ్‌లు కొనుగోలు చేసి, శిక్షణ తీసుకోవాలని సీఎం సూచించారు.

ఇవీ చదవండి..

దీదీ అహం వల్లే బెంగాల్‌ రైతులకు అన్యాయం

కోబ్రా దళంలోకి ‘మహిళా వారియర్స్‌’


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని