డీజిల్ పోయించు..నీ కూతుర్ని వెతుకుతాం!
close

తాజా వార్తలు

Published : 03/02/2021 03:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డీజిల్ పోయించు..నీ కూతుర్ని వెతుకుతాం!

పోలీసులు తీరుపై బాధితురాలి తల్లి ఆవేదన

లఖ్‌నవూ: కిడ్నాప్‌కు గురైన తన కుమార్తెను వెతికే విషయంలో పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుపై ఓ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతుర్ని వెతకాలంటే..పోలీసులు తమ వాహనాల్లో డీజిల్ పోయించమంటున్నారంటూ మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పూర్ జిల్లాకు చెందిన ఓ దివ్యాంగురాలైన మహిళ తన కుమార్తె కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ బాలికను వెతికిపట్టుకోవడంలో పోలీసులు అలసత్వం వహిస్తుండటంతో..వారిపై కాన్పూర్ పోలీసు ఉన్నతాధికారికి మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలో కమిషనర్ కార్యాలయం వద్ద స్థానిక మీడియా ఎదుట తన వ్యథను వెళ్లగక్కారు. ‘మీ కుమార్తె కోసం వెతుకుతున్నాం అంటారు. కొన్నిసార్లు బయటకు నెట్టేస్తారు. నా కుమార్తెపై నిందలు వేస్తున్నారు. వారి వాహనాల్లో డీజిల్‌ నింపితే..బాలికను వెతుకుతామంటారు. నేను పోలీసులకు లంచం ఇవ్వలేదు. కానీ, డీజిల్ మాత్రం నింపించాను. అందుకోసం రూ.10 నుంచి 15 వేల వరకు అప్పు చేశాను. ఇలా ఎంతకాలం?’ అని సదరు మహిళ వాపోయారు. తాను ఫిర్యాదు చేసిన స్థానిక పోలీసు స్టేషన్‌లో ఒకరు మాత్రమే కాస్త సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే తన బంధువే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు.  కాగా, ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

ఈ ఘటనపై కాన్పూర్ సీనియర్ పోలీసు అధికారి బ్రజేశ్ కుమార్ శ్రీవాస్తవ స్పందించారు. ఈ కేసుపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు సిబ్బందిని ఆదేశించామన్నారు. ఆమె ఆరోపణలు వాస్తవమని తేలితే..కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 

ఇవీ చదవండి:

లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికే నిప్పంటించారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని