ఆ అంశాలు.. కేరళ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం
close

తాజా వార్తలు

Published : 13/02/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ అంశాలు.. కేరళ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అవినీతి, పెద్ద ఎత్తున అక్రమ నియామకాలు కేరళలోని పినరయి విజయన్‌ సర్కారును కుదిపేస్తున్నాయి. బ్యాక్‌ డోర్‌ నియామకాల పేరిట ప్రభుత్వం తమను మోసం చేస్తోందని ఇటీవల పబ్లిక్‌ కమిషన్‌ ర్యాంకర్లు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అజెండాగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ భావిస్తోంది. తమ యువజన విభాగాలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. కాగా వీటిని సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ఎలా తిప్పికొడుతుంది? ప్రజల మెప్పుపొంది వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంటుందా?అనేది ఆసక్తికరంగా మారింది.

అధికారపక్షంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, బ్యాక్‌డోర్‌ నియామకాల ఆరోపణలు ఎల్‌డీఎఫ్‌పై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వీటికి తోడు తాజాగా పబ్లిక్‌ కమిషన్‌ ర్యాంకర్లు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ర్యాంకు లిస్టు చెల్లుబాటును పొడిగించాలని డిమాండ్‌ చేస్తున్న వారు.. తమను కాదని ప్రభుత్వం తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకుంటోందని ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ప్రభుత్వం మరో ఆరు నెలల గడువు పొడిగించినా అభ్యర్థులు నిరసనలు విరమించలేదు. వివిధ యూనివర్సిటీల విద్యార్థులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. ప్రభుత్వంలో ఎంతోకాలం పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను మానవతా ప్రాతిపదికన క్రమబద్దీకరిస్తున్నామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియ ప్రస్తుత పీఎస్సీ ర్యాంకర్ల అవకాశాలపై ఏమాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేశారు. అయినా తాత్కాలిక నియామకాలపై నిరసనకారులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చదవండి...

తమిళనాట శశి‘కలవరం’!

వ్యక్తిని కాదు.. పదవిని అవమానించారు!

పూర్తి సమాచారం కోసం కింది వీడియోను చూడండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని