
తాజా వార్తలు
హైదరాబాద్‌లో మాస్ మ్యూచువల్ పెట్టుబడులు
హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ దిగ్గజం మాస్ మ్యూచువల్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ సోమవారం ప్రకటించింది. యూఎస్ వెలుపల తొలిసారి రూ.వెయ్యికోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న సెంటర్‌గా ఇది నిలవనుంది.
మాస్ మ్యూచువల్ హైదరాబాద్ రాక పట్ల పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన ప్రముఖ బీఎఫ్ఎస్ఐ కంపెనీ మాస్ మ్యూచువల్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
Tags :