close

తాజా వార్తలు

Published : 30/08/2020 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రవేశ పరీక్షలు వాయిదా వేయండి: ఉత్తమ్‌

హైదరాబాద్: దేశంతో పాటు రాష్ట్రంలోనూ రోజురోజుకూ కరోనా వైరస్‌ విజృంభిస్తోందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ చెలగాటమాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలంటూ శుక్రవారం గాంధీ భవన్‌ నుంచి అబిడ్స్‌ జీపీవో వరకు కాంగ్రెస్‌ నేతలు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ గాంధీభవన్‌ ఆవరణలోనే నేతలు ధర్నాకు దిగారు. 

కరోనాతో దేశమంతా అతలాకుతలం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జేఈఈ, నీట్‌ పరీక్షలు నిర్వహిస్తే లక్షలాది మంది విద్యార్థులు వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టకొని పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నగర అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మర్రి శశిధర్‌ రెడ్డి, మల్లు రవి, బొల్లు కిషన్‌, ఫిరోజ్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని