హత్యలపై సీబీఐ విచారణ జరపాలి: ఉత్తమ్‌
close

తాజా వార్తలు

Published : 18/02/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హత్యలపై సీబీఐ విచారణ జరపాలి: ఉత్తమ్‌

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య హేయమైన చర్య అని.. ఈ హత్యల వెనక తెరాస హస్తం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని.. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామన్నారు. 

రాష్ట్రంలో కొంత మంది పోలీసు ఉన్నతాధికారులు దిగజారి ప్రవర్తిస్తున్నారని.. తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. అలాంటి వారందరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. న్యాయవాద దంపతుల హత్యకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకుని, సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాద దంపతుల హత్య న్యాయ వ్యవస్థపై తెరాస చేసిన అతిపెద్ద దాడిగా ఉత్తమ్‌ అభివర్ణించారు. సీఎం కేసీఆర్‌ మౌనం ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తోందని ఆక్షేపించారు. తెరాస, సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలోని న్యాయవాదులందరూ బుద్ధి చెప్పాల్సిన సమయమిదని ఉత్తమ్‌ అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని