close

తాజా వార్తలు

Updated : 08/03/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెరాస ఏడేళ్ల పాలనలో డీఎస్సీ ఏదీ?: ఉత్తమ్‌

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెరాస దిగజారి ప్రవర్తిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఓటర్లను బెదిరించి తెరాసకు ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వీడియోలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. ఈసీ తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. తెరాస మంత్రులు ఉపాధ్యాయ సంఘాలను పిలిచి బెదిరిస్తున్నారని ఆరోపించారు. వివిద రంగాల్లో ఉన్న గ్రాడ్యుయేట్‌లంతా ఆలోచించాలని.. ఇది మీ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమన్నారు. 

ఏడేళ్ల తెరాస పాలనలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఎందుకు రాలేదో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యను సీఎం కనీసం ఖండించలేదని ఆక్షేపించారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలను తెరాస ప్రభుత్వం వేధించినంతగా గతంలో ఏ ప్రభుత్వమూ ఇబ్బంది పెట్టలేదన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తామనడం మరోసారి వారిని మభ్యపెట్టడమేనని చెప్పారు. వివిధ రంగాల్లో ఉన్న పట్టభద్రులకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలని ఉత్తమ్‌ హితవు పలికారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని