వారం రోజులు రాబడి రాకుంటే కోత విధిస్తారా?
close

తాజా వార్తలు

Published : 02/04/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారం రోజులు రాబడి రాకుంటే కోత విధిస్తారా?

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉత్తమ్‌

హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. అయితే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు.

‘రాష్ట్రానికి వారం రోజులు రాబడి రాకుంటే వేతనాల్లో కోత విధిస్తారా?. తక్షణమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రైవేటు సంస్థలు, ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఎందుకు కోత విధిస్తోంది? రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. దాదాపు పది వేల కోట్ల రాబడి వస్తోంది. వృద్ధాప్యంలో ఉన్న పదవీ విరమణ ఉద్యోగులకు, పెన్షనర్లకు కోత విధించడం సరికాదు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలతో పాటు ప్రోత్సాహకాలు ఇవ్వాలి ’ అని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని