ఆ తీర్మానానికి కాంగ్రెస్‌ పూర్తి మద్దతు: ఉత్తమ్‌
close

తాజా వార్తలు

Published : 09/03/2020 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ తీర్మానానికి కాంగ్రెస్‌ పూర్తి మద్దతు: ఉత్తమ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ, సీఎఎలకు వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లయితే కాంగ్రెస్‌ పార్టీ నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఎన్‌పీఆర్‌కు సంబంధించిన కార్యకలాపాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని, అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని విజ్ఞప్తి చేశారు. మతపరమైన ఎజెండాతో కేంద్రం తీసుకొచ్చిన వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 20న ఇచ్చిన జీవో కాపీని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖకు ఉత్తమ్‌ జత చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని