నిబంధనలకు విరుద్ధంగా హాలియా సభ: ఉత్తమ్‌
close

తాజా వార్తలు

Published : 13/04/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిబంధనలకు విరుద్ధంగా హాలియా సభ: ఉత్తమ్‌

హైదరాబాద్: కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రేపు నాగార్జునసాగర్‌ హాలియాలో సీఎం కేసీఆర్ లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌తో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన ఉత్తమ్‌ తెరాసపై ఫిర్యాదు చేశారు. సాగర్‌ నుంచి స్థానికేతర నేతలు వెంటనే వెళ్లేలా చర్యలు తీసుకోవాని కోరారు. సీఎం కేసీఆర్ ఒత్తిడితో అధికారులు ఎన్నికల కోడ్‌ అమలు చేయడం లేదని వివరించారు. పోలీసు వాహనాల్లో మద్యం, డబ్బు తరలిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలపై నల్గొండ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో సాగర్‌ ఉపఎన్నిక నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని