లాక్‌డౌన్‌పై సుప్రీంకు యూపీ సర్కారు
close

తాజా వార్తలు

Updated : 20/04/2021 14:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌పై సుప్రీంకు యూపీ సర్కారు

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఐదు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలన్న అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. లాక్‌డౌన్‌ విధించే అంశం న్యాయవ్యవస్థ పరిధిలో లేదంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు సాయంత్రం విచారణ జరపనుంది.

కరోనా ఉద్ధృతి దృష్ట్యా యూపీలోని లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్‌, వారణాసి, కాన్పూర్‌, గోరఖ్‌పూర్‌లలో ఏప్రిల్‌ 26 వరకు లాక్‌డౌన్‌ విధించాలని అలహాబాద్‌ హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో వివాహాలు, సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించింది. ముందుగా నిర్ణయించుకున్న వివాహాలను కేవలం 25 మందితో నిర్వహించుకోవచ్చని సూచించింది. అయితే ఈ తీర్పును యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.

ఉత్తరప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. సోమవారం ఒక్కరోజే అక్కడ 28వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. 167 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా యూపీ సర్కారు ప్రతి ఆదివారం రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని