CoronaVirus: రసగుల్లా పంచినందుకు అరెస్ట్‌
close

తాజా వార్తలు

Published : 07/05/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CoronaVirus: రసగుల్లా పంచినందుకు అరెస్ట్‌

లఖ్‌నవూ: రసగుల్లాలు పంచినంత మాత్రానికే అరెస్టు చేయడమేంటని ఆశ్చర్యపడుతున్నారా..! అవును మరి.. కరోనా విజృభింస్తున్న వేళ నిబంధలను అన్నింటినీ గాలికి వదిలేసి, 144 సెక్షన్ ఉల్లంఘించి మరీ జనాలకు రసగుల్లాలు పంచితే అరెస్టు చేయక ఏం చేస్తారు. విషయం ఏంటంటే.. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఒక గ్రామంలో ఓటింగ్‌ ముగిశాక ఫలితాల కోసం వేచి చూస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు జనాలందరికీ రసగుల్లాలు పంచారు. ఈ విషయం తెలుసుకున్న  పోలీసులు రసగుల్లాలు పంచిన వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు కరోనా నిబంధలను పాటించలేదనీ, 144 సెక్షన్‌ను ఉల్లంఘించారనీ దాంతో నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 20 కేజీల రసగుల్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని హాపూర్‌ పోలీసులు ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని