close

తాజా వార్తలు

Updated : 22/04/2021 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాక్సిన్‌‌ విధానాన్ని వెనక్కు తీసుకోవాలి..

 ప్రధానికి లేఖ రాసిన సోనియాగాంధీ

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వివక్షాపూరితంగా, పక్షపాతంతో కూడుకుందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా దేశ పౌరులకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందివ్వాలన్న బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంది. 18ఏళ్ల వయసు పైబడిన వారికి ఉచితంగానే వ్యాక్సిన్‌ అందివ్వాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు.

‘కరోనా వైరస్‌ మహమ్మారి గత ఏడాది నుంచి పౌరులకు కఠినమైన బాధలను కలిగిస్తూనే ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష, పక్షపాత విధానాలను అనుసరిస్తూనేవుంది. ఇలాంటి నిర్ణయాలు ఇప్పటికే ఉన్న సవాళ్లను మరింత పెంచుతాయి’ అని వ్యాక్సిన్‌ విధానంపై ప్రధానికి రాసిన లేఖలో సోనియాగాంధీ పేర్కొన్నారు. 18 నుంచి 45ఏళ్ల మధ్య వయసుగల పౌరులకు ఉచితంగా టీకాలు అందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించినట్లు అర్థమవుతుందని విమర్శించారు. ఇది దేశ యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను మరచినట్లు స్పష్టంగా తెలుస్తోందని దుయ్యబట్టారు.

మూడో విడత వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా.. తయారీ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి 50శాతం కరోనా టీకా డోసులు అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటుకు మరో 50శాతం డోసులను సరఫరా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. దీంతో కొవిషీల్డ్‌ టీకాను కేంద్ర ప్రభుత్వానికి డోసుకు రూ.150, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400, ప్రైవేటుకు రూ.600గా ధరను నిర్ణయిస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. ఇలా భిన్న ధరలను నిర్ణయించడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్‌కు మూడు రకాల ధరను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. సామాన్య పౌరులు టీకాల కోసం భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని.. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకూ తీవ్ర ఆర్థిక భారంగా మారుతుందని అభిప్రాయపడింది. దీనిపై ప్రధానమంత్రి వెంటనే జోక్యం చేసుకొని వ్యాక్సిన్‌ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని