close

తాజా వార్తలు

Updated : 28/04/2021 17:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

CovidVaccine: సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్‌

దిల్లీ: కరోనా మహమ్మారిని తరిమికొట్టే మరో బృహత్తర కార్యక్రమం ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మే 1వ తేదీ నుంచి 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకా పంపిణీ మొదలవనుంది. ఇందుకోసం అర్హులైన వారందరూ తమ పేర్లను ఏప్రిల్‌ 28 నుంచి కొవిన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే.. మూడో దశ టీకా పంపిణీకి సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సమయాల్లో కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. బుధవారం సాయంత్రం  4 గంటల నుంచి నమోదు ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది.

‘‘18ఏళ్లు పైబడిన వారందరూ ఏప్రిల్‌ 28 బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. కొవిన్‌ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు, ఉమాంగ్‌ యాప్‌లోనూ తమ పేరు నమోదు చేసుకోవచ్చు. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్‌ ఖరారవుతుంది’’ అని మై గవర్నమెంట్‌ ఇండియా ట్విటర్‌ ఖాతా ద్వారా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

కేంద్రం ఇచ్చే టీకాలు.. వారికి వద్దు

18ఏళ్లు పైబడినవారందరూ టీకా కోసం తప్పనిసరిగా ముందస్తు నమోదు చేసుకోవాలని, ఎలాంటి వాకిన్‌ రిజిస్ట్రేషన్లు ఉండబోవని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. అలాగే కేంద్రం.. రాష్ట్రాలకు ఇచ్చే టీకాలను 45ఏళ్ల లోపు వారికి వినియోగించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవి కేవలం 45 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే అందించాలని పేర్కొంది. రాష్ట్రాలు, ప్రయివేటు వ్యాక్సిన్‌ కేంద్రాలు కొనుగోలు చేసే వ్యాక్సిన్లు మాత్రమే 18-45ఏళ్ల వారికి పంపిణీ చేయాలని తెలిపింది.

కొవిన్‌లో టీకా నమోదు ఇలా..

⇒ మొదట కొవిన్ పోర్టల్‌(cowin.gov.in)లో లాగిన్ చేసి, మొబైల్ నంబర్ నమోదుచేయాలి. ఆ వెంటనే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.

⇒ ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్’ పేజ్‌ ఓపెన్ అవుతోంది.

⇒ దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.

⇒ ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి.

⇒ పిన్‌కోడ్ ఎంటర్ చేసి, వెతికితే..దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని